కర్రారా: భారత్, ఆస్ట్రేలియా మహిళల మధ్య గురువారం ఇక్కడ మొదలైన తొలి టి20 క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగుల తో పటిష్ఠ స్థితిలో ఉన్న సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను తాత్కలికంగా నిలిపి వేశారు. ఆ తర్వాత దాదాపు గంట సేపు వేచి చూసిన అంపైర్లు వర్షం ఎప్పటికీ ఆగక పోవడంతో మ్యాచ్‌ని రద్దు చేశారు. కాగా భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ(17),స్మృతి మంధాన(18) శుభారంభాన్ని అందించారు. జెమీమా రోడ్రిగ్స్ 49 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్లే గార్డనర్ రెండు వికెట్లు పడగొట్టగా, సోఫీ మోలినెక్స్, జార్జియా వారెహామ్ తలా ఒక వికెట్ సాధించారు. దాదాపు గంట సేపు ఎదురు చూసినా వాన ఆగకపోవడంతో అంపైర్లు మాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా ఈ రెండు జట్లు మధ్య రెండో టి20 మ్యాచ్ శనివారం జరుగుతుంది.