Sunday, December 22, 2024

ఐసిసి ట్రోఫీల్లో ఆసీస్‌దే హవా..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రతిష్టాత్మకమైన అంతర్జాత క్రికెట్ మండలి (ఐసిసి) ట్రోఫీ ల్లో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తోంది. ఐసిసి ఆధ్వర్యంలో నాలుగు ప్రధాన ట్రోఫీలను నిర్వహించడం అనవాయితీగా వస్తోం ది. వీటిలో వన్డే, టి20 ప్రపంచకప్‌లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఐసిసి ట్రోఫీల్లో ఆస్ట్రేలి యా ఎదురులేని శక్తిగా మారింది. నాలుగు ఫా ర్మాట్‌లలో కలిపి ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఇప్పటి వరకు 10 ట్రోఫీలను సొంతం చేసుకుంది. కం గారూలు క్రికెట్ చరిత్రలో ఇతర జట్లకు అందనంత దూరంలో నిలిచింది. వన్డేల్లో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తోంది.

వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్ ఇప్పటి వరకు 8 సార్లు ఫైనల్‌కు చేరింది. ఇందులో ఏకంగా ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 1987, 1999, 2003, 2007, 2015లతో పాటు తాజాగా భారత్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లోనూ ఆస్ట్రేలియా ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో 2021లో తొలిసారి టి20 ప్రపంచకప్ ట్రోఫీని సయితం దక్కించుకుంది. అంతేగాక 202123 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకుంది. దీంతోపాటు రెండు సార్లు మరో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సాధించింది. ఇలా ఆస్ట్రేలియా పది ఐసిసి ట్రోఫీలతో ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసింది.

ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా సాధించిన రికార్డులను బద్దలు కొట్టడం ఇతర జట్లకు చాలా కష్టమేనని చెప్పాలి. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా సాధించిన రికార్డులను అందుకోవడం ఇతర జట్లకు చాలా కష్టంతో కూడిన అంశంగా చెప్పాలి. ఈ ఏడాది టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీతో పాటు తాజాగా వన్డే వరల్డ్‌కప్‌ను సాధించడంతో ఆస్ట్రేలియా మళ్లీ పూర్వవైభవాన్ని అందుకుంది. రానున్న రోజుల్లో ప్రపంచ క్రికెట్‌లో ఏకచక్రాధిపత్యాన్ని చెలాయించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కంగారూలు చాలా బలంగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాను తట్టుకుని ముందుకు సాగడం ఇతర జట్లకు కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుంటే ఆస్ట్రేలియా తర్వాత అత్యధిక ఐసిసి ట్రోఫీలు సాధించిన ఘనత భారత్, వెస్టిండీస్‌లకు దక్కుతోంది. వెస్టిండీస్ వన్డేల్లో, టి20లలో రెండేసి సార్లు విశ్వవిజేతగా నిలిచింది. దీంతో పాటు ఒకసారి (2004)లో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత్ కూడా ఐదుసార్లు ఐసిసి ట్రోఫీలను దక్కించుకుంది. ఇందులో రెండు వన్డే ప్రపంచకప్‌లు, ఒక టి20 వరల్డ్‌కప్ ఉంది. దీంతో పాటు రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా దక్కించుకుంది. ఇక ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలు మూడేసి సార్లు ఐసిసి ట్రోఫీలను దక్కించుకున్నాయి. న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికా ఒక ఐసిసి ట్రోఫీని సాధించాయి. మొత్తం మీద ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటిందనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News