Friday, February 7, 2025

కంగారూలకు బిగ్‌షాక్

- Advertisement -
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీకి కీలక ఆటగాళ్లు దూరం
మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల వల్ల పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ మెగా టోర్నమెంట్‌కు దూరమయ్యారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు కీలక బౌలర్లు జోష్ హాజిల్‌వుడ్, మిఛెల్ స్టార్క్‌లు గాయాలకు గురై టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆస్ట్రేలియా జట్టులో ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ అనూహ్యంగా వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరో ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేకుండా పోయాడు.

ఇలా కీలక ఆటగాళ్ల సేవలను ఒక్కసారిగా కోల్పోవడం ఆస్ట్రేలియాకు అతి పెద్ద షాక్‌గానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అతను లేని లోటును పూడ్చడం అనుకున్నంత తేలికేం కాదు. ఇక హాజిల్‌వుడ్, స్టార్క్‌లు లేని ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఊహించలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. గ్రీన్ కూడా దూరం కావడం అతి పెద్ద షాక్‌గా చెప్పాలి. కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడుతుందో చెప్పలేం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News