Sunday, December 22, 2024

షేన్ వార్న్ కన్నుమూత…

- Advertisement -
- Advertisement -

Australia Legend Shane Warne Passes away

సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ (52) కన్నుమూశాడు. గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షేన్ వార్న్ తుది శ్వాస విడిచారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రపంచంలోనే టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక బౌలర్ మురళీధర్ 800 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా 708 వికెట్లతో వార్న్ రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేలో 293 వికెట్లు తీశాడు. ఆసీస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించేవాడు. టెస్టు మ్యాచ్ లలో 37 సార్లు ఐదు వికెట్లు తీశాడు. టెస్టు మ్యాచ్ లలో పది సార్లు పది వికెట్లు తీసిన ఘనత అతడికే దక్కుతుంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతం అప్పర్ పారెన్ ట్రీ గల్లీలోని 1969 సెప్టెంబర్ 13 జన్మించారు. బౌలర్లలో లెగ్ స్పిన్ బౌలింగ్ చేయడంలో వార్న్ మించిన వారు లేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News