Monday, December 23, 2024

మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్… 94/3

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ 25 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. డేవిడ్ వార్నర్ 15 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లబుషింగే 18 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. స్టీవెన్ స్మీత్ పరుగులేమీ చేయకుండా అశ్విన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖావాజా(50), ట్రావిస్ హెడ్(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News