Friday, January 10, 2025

72 పరుగులకే 7 వికెట్లు… పీకల్లోతు కష్టాల్లో ఆసీస్

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలో మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఆసీస్ 25 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 72 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రవీచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయజాలంతో ఐదు వికెట్లు తీయడంతో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అశ్విన్‌కు తోడు రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో 20 పరుగుల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేయలేదు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లు డేవిడ్ వార్నర్(10), లబుసింగే(17), కారే(10) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పస్తుతం క్రీజులో స్మిత్ (18), టడీ మర్పీ(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News