Monday, December 23, 2024

పీకల్లోతు కష్టాల్లో ఆసీస్

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 49 పరగులతో ఆటను కొనసాగిస్తోంది. 400 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు వరసగా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మాథ్యూ షార్ట్ తొమ్మిది పరుగులు చేసి ప్రసిద్ధ్ బౌలింగ్‌లో అశ్విన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ వార్నర్(20), మార్నస్ లబుషింగే(16) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News