Saturday, December 21, 2024

ప్రపంచకప్ క్రికెట్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం..

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: ప్రపంచకప్ క్రికెట్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెక్కుచెదరలేదని మరోసారి నిరూపితమైంది. ఇటు పురుషుల క్రికెట్‌లో అటు మహిళల ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా ఇతర జట్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటికే పురుషుల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యధిక ట్రోఫీలు సాధించి ఇతర జట్లకు అందనంత ఎత్తులో నిలిచింది. మరోవైపు మహిళల క్రికెట్‌లో కూడా కంగారూల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా అసాధారణ విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

తాజాగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లోనూ ఆస్ట్రేలియా మహిళా టీమ్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఎన్నో కొత్త రికార్డులను తిరగరాసింది. డబుల్ హ్యాట్రిక్ ట్రోఫీలతో అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టి20 ప్రపంచకప్‌లో కంగారూ టీమ్ ఇప్పటి వరకు ఆరు ట్రోఫీలను సాధించింది. రెండు సార్లు వరుసగా మూడేసి ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుంది. ఇదే క్రమంలో డబుల్ హ్యాట్రిక్ ట్రోఫీలతో అనితర అసాధ్యమైన రికార్డును నెలకొల్పింది. భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లకు ఒక్క ప్రపంచకప్ ట్రోఫీనే సాధించడమే అసాధ్యంగా కనిపిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియా ఏకంగా రెండు డబుల్ హ్యాట్రిక్ ట్రోఫీలను సాధించి తనకు ఎవరూ సాటిరారని చాటింది.

అందనంత ఎత్తులో..
మరోవైపు మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా అత్యంత బలమైన జట్టుగా ఎదిగింది. ఫార్మాట్ ఏదైనా ఏకపక్ష విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఆస్ట్రేలియా టి20 వరల్డ్‌కప్‌ను నెగ్గడం ఇది ఆరోసారి. ఇదే సమయంలో వరుసగా మూడు ట్రోఫీలను గెలుచుకుని నయా చరిత్రను లిఖించింది. ఇంగ్లండ్ వంటి మరో బలమైన జట్టుకు సాధ్యం కానీ రికార్డులను ఆస్ట్రేలియా సాధించింది.

ఇక తాజా వరల్డ్‌కప్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాను అలవోకగా ఓడించి మరోసారి విశ్వకప్‌ను సొంతం చేసుకుంది. ట్రోఫీని సాధించే క్రమంలో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ను కూడా కోల్పోలేదు. దీన్ని బట్టి ఆస్ట్రేలియా ఆధిపత్యం ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. అంతేగాక వన్డే ఫార్మాట్‌లో కూడా ఆస్ట్రేలియా ఏడు సార్లు విశ్వవిజేతగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News