Monday, December 23, 2024

ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్: మిథున్ సంచలనం..

- Advertisement -
- Advertisement -

సింధు, శ్రీకాంత్ శుభారంభం
మిథున్ సంచలనం, ప్రణయ్ ముందుకు
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సిడ్నీ: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్.ప్రణయ్ తదితరులు తొలి రౌండ్‌లో విజయం సాధించారు. భారత ఆటగాడు మిథున్ మంజునాథ్ మొదటి రౌండ్‌లో సంచలన విజయం సాధించాడు. సింగపూర్‌కుచెందిన అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ ఏడో ర్యాంక్ ఆటగాడు కీన్ యు లోను ఓడించాడు. హోరాహోరీగా సాగిన పోరులో మిథున్ 2119, 2119తో కీన్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే మిథున్ అద్భుత ఆటను కనబరిచాడు. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న కీన్‌ను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ విజయం సాధించాడు. జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోతో జరిగిన పోరులో శ్రీకాంత్ 2118, 217తో అలవోక విజయాన్ని అందుకున్నాడు.

ప్రారంభం నుంచే శ్రీకాంత్ దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ వరుసగా రెండు సెట్లు గెలిచి ప్రీక్వార్టర్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆరో సీడ్ ప్రణయ్ తొలి రౌండ్‌లో చెమటోడ్చి విజయం సాధించాడు. హాంకాంగ్‌కు చెందిన చియుక్ లీతో జరిగిన హోరాహోరీ పోరులో ప్రణయ్ 2118, 1621, 2115తో జయభేరి మోగించాడు. మరో మ్యాచ్‌లో యువ ఆటగాడు ప్రియాంశు రజావత్ జయకేతనం ఎగుర వేశాడు. ఆస్ట్రేలియా షట్లర్ నాథన్ తంగ్‌తో జరిగిన తొలి రౌండ్‌లో రజావత్ 2112, 2116తో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ సింధు ముందంజ వేసింది. బుధవారం జరిగిన పోరులో సింధు 2118, 2113 తేడాతో భారత్‌కే చెందిన అస్మిత చాలియాను ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News