ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ నిర్ణయం
సిడ్నీ : ఆస్ట్రేలియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన రాసలీలల అంశంలో ఇద్దరు మంత్రులపై వేటు పడింది. పార్లమెంట్ భవనం ఆవరణలో సిబ్బంది రాసలీలలు చేయడం అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై వేటు పడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్షణ శాఖ మంత్రి లిండా రేనాలడ్స్, అటార్నీ జనరల్ క్రిస్టియన్ పోర్టల్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని స్కాట్ మారిసన్ ఈ మేరకు శనివారం వేటు వేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రధాని తన మంత్రివర్గంలోకి ఇద్దరు మహిళలను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల కిందట రక్షణ శాఖ మంత్రి కార్యాలయంలో ఆ శాఖకు చెందిన ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగింది. పార్లమెంట్‌లో పని చేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మాజీ ఉద్యోగి హిగ్గిన్స్ బయటపెట్టడంతో కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఇద్దరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.