Thursday, January 23, 2025

పోయిన పురాతన విగ్రహాలు తిరిగొచ్చాయి…

- Advertisement -
- Advertisement -

Australia Returns 29 Antiquities to India
ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పగింత

న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్ల క్రితం దేశం దాటిపోయిన వందల సంవత్సరాల నాటి అపురూప కళాఖండాలు ఎట్టకేలకు ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు తిరిగి చేరుకున్నాయి. ఈ 29 కళాఖండాలలో మహాశివుడు, విష్ణుమూర్తితోపాటు జైన సాంప్రదాయానికి చెందిన పురాతన శిల్పాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన ఈ పురాతన కళాఖండాలను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సందర్శించి పరిశీలించినట్లు ప్రభుత్వ వర్గాలు సోమవారం తెలిపాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి ఈ 29 పురాతన ప్రతిమలను ఆరు విభాగాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. మహాశివుడు ఆయన భక్తులు, అమ్మవారి ఆరాధన, మహావిష్ణువు, ఆయన అవతారాలు, జైన సాంప్రదాయం, చిత్తరువులు, అలంకరణ ప్రతిమలుగా వర్గీకరించినట్లు వర్గాలు వివరించాయి. ఇవి శాండ్‌స్టోన్, పాలరాయి. కంచు, ఇత్తడి, కాగితం తదితర వస్తువులతో రూపొందినవని వారు తెలిపారు. ఈ కళాఖండాలు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌కు చెందినవిగా వారు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News