Thursday, January 23, 2025

ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 311/5

- Advertisement -
- Advertisement -

బిర్మింగ్‌హామ్: ఎడ్జ్‌బాస్టన్‌లో యాషెస్ సిరీస్‌లో భాగాంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ రెండు రోజు ముగిసే సమయానికి 94 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 311 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. ఇప్పటికి ఇంగ్లాండ్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఉస్మాన్ ఖావాజా సెంచరీతో కదం తొక్కాడు. ఖావాజా 279 బంతుల్లో 126 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ట్రావిస్ హెడ్ (50), అలెక్స్ కారే (52) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో స్టివెన్ స్మిత్ (16), కామెరూన్ గ్రీన్ (38), డేవిడ్ వార్నర్ (09), మార్నస్ లబుషింగే(00) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీయగా బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు.

Also Read: విష్ణు ప్రియతో ప్రేమపెళ్లిపై స్పందించిన జెడి చక్రవర్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News