Monday, December 23, 2024

ఆసీస్ 406/7

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఆసీస్ 145 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 406 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీకి చెరువలో ఉన్నాడు. ఇప్పటికే 178 పరుగుల చేసి భారీ సెంచరీతో కదం తొక్కుతున్నాడు. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కామెరూన్ గ్రీన్ 114 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.

అలెక్స్ కారే అశ్విన్ బౌలింగ్‌లో అక్షర పటేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ ఆరు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖావాజా(178), నాథన్ లయాన్ (05) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత జట్టు బౌలర్లలో రవీచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా షమీ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News