పెర్త్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆసీస్ 27 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 67 పరుగులతో ఆటను ముగించింది. ప్రస్తుతం భారత్ 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. జస్పీత్ర్ బుమ్రా బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్లు ఆగమాగమయ్యారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే. బుమ్రా బౌలింగ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్లు క్రీజులో నిలబడడానికి గజ గజ వణికిపోయారు. ఆసీస్ బ్యాట్స్ మెన్లు ఉస్మాన్ ఖవాజా(08), నాథన్(10), లబుషీంగే(02), స్టీవెన్ స్మిత్(0), ట్రావిస్ హెడ్(11), మిచెల్ మార్ష్(06), అలెక్స్ కారే(19), ప్యాట్ కమ్నీస్(03), పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కారే(19), మిచెల్ స్టార్క్(06) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు, హర్షిత్ రానా ఒక వికెట్ తీశారు.
బుమ్రా ధాటికి కుప్పకూలిన ఆసీస్ 67/7
- Advertisement -
- Advertisement -
- Advertisement -