Friday, December 20, 2024

మ్యాక్స్‌వెల్ మెరుపులు

- Advertisement -
- Advertisement -

అజేయ డబుల్ సెంచరీతో చెలరేగిన గ్లెన్
అఫ్గాన్‌పై ఆస్ట్రేలియా సంచలన విజయం

ముంబై: ప్రపంచకప్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై సంచలన విజయం సాధించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 201 (నాటౌట్) అజేయ శతకంతో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు అఫ్గాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి ధాటికి తట్టుకోలేక ఒక దశలో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది.

మ్యాక్స్‌వెల్ హీరోచిత ఇన్నింగ్స్..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముం దుకు తీసుకెళ్లే బాధ్యతను గ్లెన్ మ్యాక్స్‌వెల్ తనపై వేసుకున్నాడు. అతనికి కెప్టెన్ కమిన్స్ 68 బం తుల్లో 12 (నాటౌట్) అండగా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోసిన మ్యాక్స్‌వెల్ చారిత్రక బ్యాటింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. అసాధారణ రీతిలో చెలరేగిన మాక్స్‌వెల్ 128 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లు, 21 ఫోర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ను ఇబ్రాహీం జర్దాన్ 129(నాటౌట్) అజేయ శతకంతో ఆదుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News