Sunday, December 22, 2024

ఆసీస్ టార్గెట్ 400

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. ఆసీస్ ముందు 400 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ చివరలో సునామీ సృష్టించాడు. అయ్యర్, గిల్ రెండో వికెట్‌పై 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో బీభత్సం సృష్టించారు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. 44 ఓవర్లలో గ్రీన్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ వరసగా నాలుగు బంతుల్లో నాలుగు సిక్స్‌లు దూకుడు ప్రదర్శించాడు. సూర్యకుమార్ 37 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  రవీంద్ర జడేజా తొమ్మిది బంతుల్లో 13 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు తీయగా హజిల్ వుడ్, అబాట్, జంపా తలో ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్లు (31 ఫ్లోర్లు, 18 సిక్స్ లు) బౌండరీల ద్వారా 232 పరుగులు రాబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News