Wednesday, January 22, 2025

వన్డే ప్రపంచకప్ 2023కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక..

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. ఈ మెగా టోర్నమెంట్ కోసం 15 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. 18 మంది ప్రాథమిక ఆటగాళ్ల నుంచి ముగ్గురిని తప్పించింది. ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్, స్పిన్నర్ తన్వీర్ సంఘాలను తప్పించింది. ఇక సీనియర్ బౌలర్ పాట్ కమిన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

సీనియర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, అలెక్స్ కెరీ, మిఛెల్ మార్ష్, మాక్స్‌వెల్, స్టార్క్, ఆడమ్ జంపా తదితరులకు జట్టులో చోటు లభించింది. స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్, స్టాయినిస్, సీన్ అబాట్, గ్రీన్‌లతో కూడిన బలమైన ఫాస్ట్ బౌలింగ్ లైనప్ జట్టుకు అందుబాటులో ఉంది. అంతేగాక స్మిత్, వార్నర్, ట్రావిస్ హెడ్, మాక్స్‌వెల్, మార్ష్‌లతో బ్యాటింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది.

జట్టు వివరాలు:
కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, వార్నర్, అలెక్స్ కెరీ, మిఛెల్ మార్ష్, మాక్స్‌వెల్, స్టోయినిస్, ఆడమ్ జంపా, సీన్ అబాట్, హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, గ్రీన్, అష్టన్ అగర్, మిఛెల్ స్టార్క్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News