ముంబై: భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పాట్ కమిన్స్ అందుబాటులో లేకుండా పోవడంతో వన్డేలకు కూడా స్మిత్ సారథ్యం వహించనున్నాడు. భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇక ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తాజా వన్డేల్లో కూడా అతన్నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్ తలి అనారోగ్యం బారిన పడడంతో అర్ధాంతరంగా స్వదేశం వెళ్లిపోయాడు. ఇక ఇటీవలే కమిన్స్ తల్లి మృతి చెందారు. దీంతో కమిన్స్ వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. భారతఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శుక్రవారం తెరలేవనుంది. తొలి వన్డే మార్చి 17న ముంబైలో జరుగనుంది. రెండో మార్చి 19న విశాఖపట్నంలో జరుగుతుంది. ఇక మూడో, చివరి వన్డేకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.
జట్టు వివరాలు:
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), అలెక్స్ కారే, సీన్ అబాట్, అష్టన్ అగర్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిఛెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మిఛెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.