Wednesday, January 22, 2025

మిఛెల్ మార్ష్‌కు కెప్టెన్సీ

- Advertisement -
- Advertisement -

వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా టీమ్ ఎంపిక

మెల్‌బోర్న్: టి20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా టీమ్‌ను ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టుకు మిఛెల్ మార్ష్ సారథ్యం వహిస్తాడు. క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం జట్టును ప్రకటించింది. రెండేళ్లుగా టి20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్న కామెరూన్ గ్రీన్, అష్టన్ అగర్‌లను వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించారు. సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు జట్టులో స్థానం దక్కలేదు.

ఐపిఎల్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్న ట్రావిస్ హెడ్, స్టోయినిస్, టిమ్ డేవిడ్ తదితరులకు కూడా మెగా టోర్నీలో ఆడే అవకాశం కల్పించారు. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపిఎల్‌లో పెద్దగా ప్రభావం చూపని గ్లెన్ మాక్స్‌వెల్, కమిన్స్, స్టార్క్, వేడ్ తదితరులకు కూడా ఆస్ట్రేలియా టీమ్‌లో స్థానం లభించింది. వరల్డ్‌కప్ టీమ్‌కు ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. అతని సారథ్యంలో ఆస్ట్రేలియా మెగా టోర్నీలో బరిలోకి దిగనుంది.

జట్టు వివరాలు:
మిఛెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిఛెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూవేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News