Wednesday, January 22, 2025

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

కృష్ణాజిల్లాకు చెందిన ఉజ్వల అనే 23 ఏళ్ల వైద్యురాలు ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్ చేస్తూ దుర్మరణం పాలైన సంఘటన మరువకముందే మరో తెలుగు మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది.

హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ కు చెందిన శ్వేత అనే వివాహిత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు  గురయ్యారు. విక్టోరియా రాష్ట్రంలోని బక్లీ అనే ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్లో దుండగులు ఆమెను హత్య చేసినట్లు  తెలిసింది. పోలీసులు శ్వేత మృతదేహాన్ని ఒక డబ్బాలో కనుగొన్నారు. శ్వేత భర్త, మూడేళ్ల కుమారుడు హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. హంతకులు శ్వేతకు తెలిసినవారే అయి ఉంటారని, ఆమెను నమ్మించి, హోటల్ కు తీసుకువచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News