Wednesday, January 22, 2025

ఆస్ట్రేలియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

డబ్లిన్ : ఐసిసి ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఐర్లాండ్ మహిళలతో శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 49 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. ఒర్లా ప్రెండర్‌గాస్ట్ (71) ఒక్కటే మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచింది. ఓపెనర్ గాబి లెవిస్ (35). కెప్టెన్ లౌరా డెలాని (36) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 35.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు పొయెభా లిచ్‌ఫీల్డ్ (106) నాటౌట్, సదర్లాండ్ (109) నాటౌట్ అజేయ శతకాలతో చెలరేగారు. దీంతో ఆస్ట్రేలియా అలవోక విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News