Monday, December 23, 2024

ఆస్ట్రేలియా గేట్లకూ లాక్‌లే

- Advertisement -
- Advertisement -

వలసల నిరోధ క్రమంలో ఆస్ట్రేలియా మరో చర్యకు దిగింది. స్టూడెంట్స్ వీసాలకు సంబంధించిన సేవింగ్ పరిమితిని ఆస్ట్రేలియా భారీగా పెంచింది. ఇది ఎక్కువగా భారతీయ విద్యార్థులకు ఇబ్బందికరం కానుంది. స్టూడెంట్ వీసాలకు తప్పనిసరి అయిన సేవింగ్ మొత్తం లేదా చూపాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పటివరకూ 3,430 డాలర్లు. కాగా దీనిని ఇప్పుడు 19,576 డాలర్లకు పెంచారు. ఈ విధంగా ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు చదువులకు వెళ్లే విద్యార్థి బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా రూ 16 లక్షల వరకూ చూపెట్టాల్సి ఉంటుంది. భాఏడునెలల కాలంలో పెంపుదలకు దిగడం ఇది రెండోసారి. ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లే భారతీయ విద్యార్థులకు అదనపు భారం కానుంది.

పెద్ద ఎత్తున సాగుతున్న వలసలను పలుస్థాయిల్లో కట్టడిచేసేందుకు ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ వర్గాలు చాలాకాలంగా యత్నిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు తాము ఆస్ట్రేలియాలో చదువులకు వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా తమకు కనీసం 29,710 ఆస్ట్రేలియా డాలర్ల మేర సేవింగ్స్ ఉన్నట్లు తెలిపే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పలు రకాల కట్టుదిట్టమైన నిబంధనల క్రమంలో గత ఏడాది నుంచే ఆస్ట్రేలియాకు విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పడు తీసుకున్న నిర్ణయంతో ఈ విషయంలో మరింత బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. తమ దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆంటోనీ అల్బనీస్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. వీసా పొందేందుకు నిబంధనలను మరింత కట్టుతరం చేస్తూ వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News