Wednesday, January 22, 2025

ఆస్ట్రేలియాదే యాషెస్

- Advertisement -
- Advertisement -

నాటింగ్‌హామ్: ప్రతిష్టాత్మకమైన మహిళల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా యాషెస్ ట్రోఫీని దక్కించుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరికి విజయం కంగారూలను వరించింది. సోమవారం చివరి రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకే కుప్పకూలింది. 268 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆసీస్ బౌలర్లు సఫలమయ్యారు. అష్లే గార్డ్‌నర్ అసాధారణ బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చింది. ఊరిస్తున్న లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఎమ్మా లాంబ్, టామీ బ్యూమౌంట్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన బ్యూమౌంట్ 22 పరుగులు చేసి వెనుదిరిగింది.

ఎమ్మా 28 పరుగులు సాధించి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత గార్డ్‌నర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. దీంతో ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. డానిలె వ్యాట్ మాత్రమే ఒంటరి పోరాటం చేసింది. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వ్యాట్ ఐదు ఫోర్లతో 54 పరుగులు సాధించింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49 ఓవర్లలో 178 పరుగుల వద్దే ముగిసింది. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన గార్డ్‌నర్ 66 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లను పడగొట్టింది. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473 పరుగులు చేయగా ఇంగ్లండ్ 463 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 257 పరుగులు చేసింది. ఇక రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 12 వికెట్లను పడగొట్టి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన గార్డ్‌నర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

పురుషుల టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను ఇరు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అనవాయితీ. తాజాగా మహిళల విభాగంలో కూడా ఇరు జట్ల మధ్య యాషెస్ సిరీస్‌ను నిర్వహించారు. ఇది కూడా చివరి రోజు వరకు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్ల క్రికెటర్లు సర్వం ఒడ్డి పోరాడడంతో మ్యాచ్ ఆఖరు వరకు ఉత్కంఠ తప్పలేదు. అనూహ్య మలుపులు తిరిగిన మ్యాచ్‌లో చివరికి విజయం ఆస్ట్రేలియాకు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News