Sunday, December 22, 2024

ఓటమి అంచున విండీస్..

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ ఓటమి అంచున నిలిచింది. గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ ఆరు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే కరీబియన్ టీమ్ మరో 22 పరుగులు చేయాలి. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 81.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 129 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను ట్రావిస్ హెడ్ ఆదుకున్నాడు. విండీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన హెడ్ అద్భుత సెంచరీని సాధించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ధాటిగా ఆడిన హెడ్ 134 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించాడు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ ఐదు, రోచ్, గ్రీవ్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్ వరుసగా వికెట్లను కోల్పోయింది. జోస్ హాజిల్‌వుడ్ అద్భుత బౌలింగ్‌తో విండీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. హాజిల్‌వుడ్ 18 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. విండీస్ బ్యాటర్లలో మెకన్జి (26), గ్రీవ్స్ (24), జోషువా లిటిల్ 17 (బ్యాటింగ్) మాత్రమే కాస్త రాణించారు. మరోవైపు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News