- Advertisement -
ముంబయి : మ్యాక్స్ వెల్ ఆఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ 76 బంతుల్లో సెంచరీ చేశాడు. కమిన్స్ అండతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు మ్యాక్స్. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.
ప్రస్తుతం మ్యాక్స్ వెల్, ప్యాట్ కమిన్స్ లు నిలకడగా ఆడుతున్నారు. అఫ్గానిస్థాన్ విజయానికి 3 వికెట్ల దూరంలో ఉంది. మ్యాక్స్ వికెట్ పడితే ఈ మ్యాచ్ అఫ్గాన్ దేనని చెప్పాలి. 38 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆసీస్ 223 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్ వెల్(133), కమిన్స్(11)లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలవాలంటే 76 పరుగులు చేయాల్సిఉంది.
- Advertisement -