Friday, December 20, 2024

నేడు ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా ఢీ..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వరుస ఓటములతో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. అయితే మాజీ విజేత ఆస్ట్రేలియాకు ఇంకా సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు విజయాలు సాధించి ఆస్ట్రేలియా మెరుగైన స్థితిలో ఉంది. ఇంగ్లండ్‌ను కూడా ఓడించి సెమీస్ అవకాశాలను మరింత పెంచుకోవాలని భావిస్తోంది.

ఆరంభంలో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన కంగారూలు ఆ తర్వాత అద్భుత ఆటతో వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇంగ్లండ్‌పై కూడా గెలిచి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా బలంగా ఉంది. ట్రావిస్ హెడ్, వార్నర్, స్మిత్, మిఛెల్ మార్ష్, మాక్స్‌వెల్ తదితరులు జోరుమీదున్నారు. బౌలింగ్‌లోనూ ఆస్ట్రేలియా బాగానే రాణిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News