కేప్‌టౌన్ : మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు రికార్డు సృష్టించింది. వరుసగా ఆరుసార్లు టి20 వరల్డ్ కప్‌ను ముద్దాడిన ఏకైక జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆదివారం కేప్‌టౌన్‌లో జరిగిన టైటిల్ పోరులో ఆతిధ్య దక్షిణాఫ్రికా జట్టును ఓడించి మరోసారి కప్‌ను ఎగరేసుకు పోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ(79) పరుగులతో అజేయంగా నిలిచి, ఆసీస్ జట్టు గెలుపులో కీలక భూమిక పోషించింది.
అదేవిధంగా సౌతాఫ్రికా ఓపెనర్ లారా వోల్వార్డ్(61 ) పరుగులతో రాణించినా ఫలితం దక్కలేదు. అంతకుముందు టాస్ గెలిచి బ్యా టింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం 157 పరుగుల ల క్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 ప రుగులు మాత్రమే చేయగలిగింది. లారా వోల్వార్డ్ తప్ప ఆ జట్టులో మరెవరూ రా ణించదు. దీంతో 19 పరుగు ల తేడాతో ఓటమితో తొలిసారి ప్రపంచకప్ సాధించాలన్న ఆశలు అవిరయ్యాయి.