Sunday, December 22, 2024

ఆరు వికెట్ల తేడాతో భారత్‌ చిత్తు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే టీమిండియా ఆశలపై కంగారూలు నీళ్లు చల్లారు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాకు ఇది వన్డేల్లో రికార్డు స్థాయిలో ఆరో వరల్డ్‌కప్ ట్రోఫీ కావడంవిశేషం. మరోవైపు మూడోసారి విశ్వవిజేతగా నిలువాలని భావించిన భారత్‌కు నిరాశే మిగిలింది. వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2003లో కూడా భారత్ తుదిపోరులో కంగారూల చేతిలో పరాజయం చవిచూసింది.

ఇక కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో జరిగిన ఫైనల్లో ఆతిథ్య భారత్ పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోర వైఫల్యం చవిచూసింది. దీంతో 130 కోట్ల మంది భారతీయులు నిరాశలో మునిగిపోయారు. ఫైనల్‌కు చేరే క్రమంలో ఆడిన పది మ్యాచుల్లోనూ విజయం సాధించిన టీమిండియా తుదిపోరులో ఆ సంప్రదాయాన్ని కొనసాగించడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News