- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచకప్‌నకు సన్నాహకంగా పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు వార్నర్ (48), మిఛెల్ మార్ష్ (31), వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్ (27), లబుషేన్ (40) మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. చివర్లో మాక్స్‌వెల్ (77), గ్రీన్ (50), ఇంగ్లిస్ (48) బ్యాట్‌ను ఝులిపించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 47.4 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (90), ఇఫ్తికార్ అహ్మద్ (83), మహ్మద్ నవాజ్ (50) రాణించినా జట్టును గెలిపించలేక పోయారు.
- Advertisement -