Wednesday, January 22, 2025

సౌతాఫ్రికా పై ఆస్ట్రేలియా విజయం..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా పోరాటం మరోసారి సెమీ ఫైనల్లోనే ముగిసింది. గురువారం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన హోరాహోరీ పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో ఆదివారం అహ్మదాబాద్‌లో టీమిండియాతో జరిగే తుది సమరానికి ఆస్ట్రేలియా అర్హత సాధించింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలని భావించిన దక్షిణాఫ్రికాకు మళ్లీ నిరాశే మిగిలింది. సెమీస్ అడ్డంకిని దాటడంలో మరోసారి విపలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌లు ఆస్ట్రేలియాకు మెరుపు ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన వార్నర్ 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో వేగంగా 29 పరుగులు చేశాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. మిగతా వారలో స్టీవ్ స్మిత్ (30), ఇంగ్లిస్ (28), స్టార్క్ 16 (నాటౌట్), కమిన్స్ 14 (నాటౌట్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఒక దశలో 24 సౌతాఫ్రికా 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే క్లాసెన్ (47)తో కలిసి మిల్లర్ పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్ 8 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 101 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News