Tuesday, February 11, 2025

చివరి టెస్టులోనూ శ్రీలంక ఓటమి.. ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్

- Advertisement -
- Advertisement -

గాలే: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా జరిగిన చివరి టెస్టును ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక నిర్ధేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా చేధించింది ఆస్ట్రేలియా. ఉస్మాన్ ఖావా జా(27), మార్నస్ లబుషేన్(26) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు 211/8 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ను ప్రారంభించిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌటైంది. దీంతో పర్యాటక ఆసీస్ ముందు కేవలం 75 పరుగుల లక్ష్యా న్ని మాత్రమే శ్రీలంక ఉంచగలిగింది.

కాగా లంక బ్యాటర్లలో ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (76) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ కుశాల్ మెండి స్ (48) రాణించాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే కేవలం 14 పరుగులే చేసి ఔటయ్యాడు. పతుమ్ నిషాంక (8), దినేశ్ చండిమాల్ (12), కమిందు మెండీస్ (14), కెప్టెన్ ధనంజయ డిసిల్వ(23) రాణించలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాథ్యూ కునేమన్, నాథన్ లియోన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించారు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటిసి ఫైనల్‌కు ఆర్హత సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌ను ఓడించి ఆసీస్ తమ టైటిల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. జూన్ 11 నుంచి జూన్ 15 వరకు లార్డ్స్ వేదికగా జరగనున్న ఈ మహాపోరులో దక్షిణాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News