- Advertisement -
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన 298 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్ అన్నాబెల్ సదర్లాండ్(110) సెంచరీతో చెలరేగింది. ఇక, భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లతో రాణించింది. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ స్మృతి మంధనా(105) సెంచరీతో మెరిసినా.. మిగతా వారు సపోర్ట్ చేయలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్ 83 పరుగులు తేడాతో గెలుపొందింది.
- Advertisement -