వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో బుధవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరును సాధించింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గ్లెన్ మాక్స్వెల్ 31 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ 69 పరుగులు చేశాడు. ఫిలిప్ 47 పరుగులతో తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 17.1 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. ఆష్టన్ అగర్ ఆరు వికెట్లతో చెలరేగి పోయాడు. అతని ధాటికి ఎదురునిలువలేక కివీస్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (47), కాన్వే (38) తప్ప మిగతావారు విఫలమయ్యారు. కాగా సిరీస్లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి విజయం. మొదటి రెండు మ్యాచుల్లో కివీస్ గెలిచిన విషయం తెలిసిందే.
Australia won 3rd T20 by 64 runs against Kiwis