Monday, January 13, 2025

ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తు చిత్తు..

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: ప్రతిష్టాత్మకమైన బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా చిత్తు చిత్తుగా ఓడింది. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో అతిధ్య ఆస్ట్రేలియా జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి టెస్టులో ఓటమికి ప్రతికారం తీర్చుకుంది. దీంతో ఇరుజట్టు సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాయి. తొలి టెస్ట్‌లో సమష్టి ప్రదర్శనతో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం సమష్టి వైఫల్యంతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. చివరి రోజు 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 3.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

నాథన్ మెక్‌స్వీనీ(10 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా(9 నాటౌట్) అలవోకగా విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. అంతకుముందు 128/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది. పాట్ కమ్మిన్స్ (5/57)తో టీమిండియాను కోలుకోకుండా దెబ్బకొట్టగా స్కాట్ బోలాండ్(3/51), మిచెల్ స్టార్క్(2/60) మిగతా వికెట్లు పడగొట్టారు. భారత బ్యాటర్లలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(42) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

పంత్ ఔట్.. భారత్‌కు షాక్..
128/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పంత్(28) ఓవర్ నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు జోడించకుండానే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అశ్విన్(7)ను కమిన్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో హర్షిత్ రాణా సాయంతో నితీస్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా కమిన్స్ హర్షిత్ రాణాను ఔట్ చేసి నితీశ్‌పై ఒత్తిడి పెంచాడు.

కమిన్స్ బౌన్సర్లను బౌండరీలకు తరలించిన నితీష్.. అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన సిరాజ్ ఓ బౌండరీ బాది బోలాండ్ బౌలింగ్‌లో ట్రావీస్ హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. సిరాజ్ ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా 157 పరుగుల ఆధిక్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో అధిగమించిన భారత్ 18 పరుగుల లీడ్ మాత్రమే లభించింది. దాంతో ఆసీస్ ముందు 19 పరుగుల లక్ష్యం నమోదైంది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా లక్షాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News