Friday, December 20, 2024

ఒక్కడే… ఆస్ట్రేలియా ఘనవిజయం

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు మ్యాక్స్ వెల్ చేర్చాడు. మాక్స్‌వెల్ ఆఫ్ఘన్ పేసర్లతో ఒక ఆట ఆడుకున్నాడు. అభిమానుల ఉత్సాహం రెచ్చిపోయి ఆడుతూ డబుల్ సెంచరీతో మ్యాచ్ ను గెలిపించాడు.

గ్లెన్ మాక్స్‌వెల్ నుండి ఇది అద్భుతమైన ప్రదర్శనగా చెప్పవచ్చు. అతను ఈ మ్యాచ్ లో తన తొలి 200 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు అనూహ్యమైన విజయాన్ని సాధించింది. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ నాక్‌లలో ఇది ఒకటి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News