Tuesday, January 7, 2025

ఐదో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

సిడ్నీ వేదికగా జరిగిన చివరి ఐదో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టీమిండియాపై ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. దీంతో బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 185, రెండో ఇన్నింగ్స్ లో 157 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News