గాలే: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోపే ముగియడం విశేషం. పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఏక పక్ష విజయంతో సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. పది పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండానే ఛేదించింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి తట్టుకోలే లంక రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. నాథన్ లియాన్, ట్రావిస్ అద్భుత బౌలింగ్‌తో అలరించారు. లియాన్ 31 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ట్రావిస్ హెడ్ 2.5 ఓవర్లలో కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. స్వెప్సన్ రెండు వికెట్లు తీయడంతో లంక ఇన్నింగ్స్ 22.5 ఓవర్లలో 113 పరుగుల వద్దే ముగిసింది. లంక జట్టులో కెప్టెన్ కరుణరత్నె (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారిలో నలుగురే రెండంకెల స్కోరును అందుకున్నారు. ఇక లంక తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా 321 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కీలకమైన తొలి 109 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.