Sunday, January 19, 2025

భారత్‌పై గెలిచిన ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

షార్జా: మహిళల టి20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టీమిండియాపై ఆసీస్ తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత ముందు ఆసీస్ 152 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. భారత జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేయడంతో ఓటమిని చవిచూసింది. భారత జట్టు హర్మన్ ప్రీత్ కౌర్ ఒక్కరే హాఫ్ సెంచరీతో చెలరేగారు. దిప్తీ శర్మ(29), షఫాలీ వర్మ(20), జెమీమా రోడ్రీగూస్(16) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు విఫలంకావడంతో భారత జట్టు ఓడిపోయింది. ఆసీస్ బౌలర్లలో మోలీనక్స్, సుథర్‌ల్యాండ్ చెరో రెండు వికెట్లు తీయగా స్కట్, గార్డెర్ చెరో ఒక వికెట్ తీశారు. ప్రధాని వికెట్లు తీసిన మోలీనక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News