Sunday, December 22, 2024

నమీబియాపై గెలిచిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

అంటిగ్వా: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా నమీబియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. నమీబియాసై ఆసీస్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. నమీబియా తొలుత 17 ఓవర్లలో 72 పరుగులు చేసి ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో నమీబియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. జంపా నాలుగు వికెట్లు తీసి నమీబియా నడ్డి విరిచాడు. ఆసీస్ బౌలర్లలో హజిల్ వుడ్, స్టయినీస్ చెరో రెండు వికెట్లు తీయగా కమ్నీస్, నాతన్ ఎల్లీస్ చెరో ఒక వికెట్ తీశారు. ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి 74 పరుగులు చేసి విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ 20 పరుగలు చేసి వీయిస్ బౌలింగ్‌లో ట్రంపెల్‌మెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్(34), మిచెల్ మార్ష్(18) పరుగులు చేశారు. నాలుగు వికెట్లు తీసిన జంపాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. నమీబియా బ్యాట్స్‌మెన్లలో గెర్హార్డ్ ఎరాస్‌మస్ ఒక్కడే 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితకావడంతో జట్టు ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా వరసగా మూడు విజయాలు సాధించి సూపర్ 8కు క్వాలిఫై రెండో జట్టుగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News