ఒమన్‌పై 36 పరుగుల తేడాతో గెలుపు
బార్బడోస్ : టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. గురువారం ఒమన్‌తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బ్యాట్‌తో, ఇటు బాల్ విధ్వంసం సృష్టించిన మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో, 2×4 6×6), (3/19) జట్టు విజయంలో కిలక భూమిక పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56; 51 బంతుల్లో, 6×4, 1×6), స్టొయినిస్ అర్ధశతకాలు సాధించారు. అయితే ఆసీస్ 12 ఓవర్లకు 63/3 స్కోరు మాత్రమే సాధించింది. ఆ తర్వాత స్టొయినిస్ చెలరేగడంతో మ్యాచ్ స్వరూపమే మారింది. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 129 పరుగులే చేసి, విజయానికి 39 పరుగుల దూరంలో ఆగింది. ఇక ఒమన్ బ్యారట్లలో అయాన్ ఖాన్ (36) టాప్ స్కోరర్. స్టొయినిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. స్టార్క్, ఎలిస్, జంపా తలో రెండు వికెట్లు తీశారు. ఒమన్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు.
ఆసీస్ బోణీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -