Saturday, November 16, 2024

ఆస్ట్రేలియాదే సిరీస్

- Advertisement -
- Advertisement -

చివరి టెస్టులో పాక్‌పై ఘన విజయం

Australia won on Pakistan in Test series

లాహోర్: పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 10తో సొంతం చేసుకుంది. శనివారం చివరి రోజు పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైంది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు తీస్తూ పాకిస్థాన్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ (27) చివరి రోజు ఆరంభంలోనే వెదనుదిరిగాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ (17) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలే పోయాడు. అయితే ఓపెనర్ ఇమాముల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు జట్టును ఆదుకునేందుకు తీవ్రంగా పోరాడారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన ఇమాముల్ హక్ 199 బంతుల్లో ఐదు ఫోర్లతో 70 పరుగులు చేశాడు.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజమ్ ఆరు బౌండరీలతో 55 పరుగులు సాధించాడు. మిగతా వారిలో సాజిద్ ఖాన్ (21) కాస్త రాణించారు. ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ ఐదు, కెప్టెన్ పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశారు. ఇక సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే చివరి మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ను దక్కించుకుంది. కమిన్స్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్ గడ్డపై ఆస్ట్రేలియా ఆడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News