Wednesday, January 8, 2025

ఆస్ట్రేలియా ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

బ్లూమ్‌ఫాంటెన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఉత్కం ఠ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ తెంబ బవుమా (114) అజేయ శతకం సాధించాడు. మార్కొ జాన్సెన్ (32) తనవంతు పాత్ర పోషించా డు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 40.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఒక దశలో 113 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన కంగారూలను మార్నస్ లబూషేన్ 80 (నాటౌట్), అష్టన్ అగర్ 48 (నాటౌట్) ఆదుకున్నారు. వీరద్దరూ 8వ వికెట్‌కు 112 పరుగులు జోడించి ఆస్ట్రేలియాను గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News