విదేశీ పర్యాటకుల విషయంలో ఆస్ట్రేలియా వైఖరి
కాన్బెర్రా: విదేశీ పర్యాటకులను ఆస్ట్రేలియా వచ్చే ఏడాది(2022) వరకు అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కోవిడ్-19 పర్యాటక ఆంక్షలు కొన్నింటిని ఎత్తేయనున్నట్లు మంగళవారం తెలిపారు. విదేశీ హద్దులను తిరిగి తెరువనున్నట్లు, నైపుణ్యం ఉన్న ప్రవాసులు, విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 16 ఏళ్లకు పైబడినవారికి 80శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
తీవ్ర పర్యాటక ఆంక్షలు ఆస్ట్రేలియా దేశస్థులను ఇంటికే పరిమితమయ్యేలా చేశాయి. విదేశీయులను దూరంగా ఉంచాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియాకు ప్రవాసులు తగ్గడం అన్నది ఇప్పుడే జరిగింది. అంతర్జాతీయ విద్యార్థుల భారీ ఫీజులపై ఆధారపడి ఉన్న ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు గడ్డు రోజులను గడుపుతున్నాయి. ఆస్ట్రేలియాకు రావలసిన విదేశీ విద్యార్థులు ఇంకా వేరే దేశాలకు వెళతారేమోనని భయాందోళనలు చెందుతోంది.
ఆస్ట్రేలియా నగరాలైన సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్బెర్రా(రాజధాని)లో చాలా దుకాణాలు, పరిశ్రమలు మూతపడిపోయి ఉన్నాయి. ఆస్ట్రేలియాలో విధించిన తీవ్ర ఆంక్షలు అక్కడి కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. కుటుంబసభ్యులు ఒకరికొకరు దూరం అవుతున్నారు.ఆస్ట్రేలియాకు పర్యాటక రంగం నుంచే 33 బిలియన్‌ల ఆస్ట్రేలియా డాలర్ల ఆదాయం వస్తుంది. అంతర్జాతీయ పర్యాటకులు 2022 మార్చి నాటికి తమ దేశానికి రావాలని ఆస్ట్రేలియన్ టూరిజం ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ కోరుకుంటోంది.