Sunday, December 22, 2024

ఖండాంతరాలకు వ్యాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్రీన్ ఉద్యమంలా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఖండాంతరాలు దాటింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన ప్రియాంక ఆస్ట్రేలియాలోని దిలాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

ఈ సందర్భంగా వారి వివాహ దినోత్సవం సందర్భంగా ప్రియాంక సొంతూరు పాలడుగు గ్రామంలో మొక్కలు నాటారు. వీరి వెంట ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఏవో డాక్టర్ కే రాజశేఖర్ గౌడ్, డాక్టర్ సుజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంట మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావితరాలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేసిన ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రియాంకా దిలాన్ దంపతులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News