Monday, December 23, 2024

మంత్రి దామోదర్ రాజనర్సింహతో ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ -జెడ్ సండర్సన్ భేటీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మెడికల్ పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన
అభ్యర్థులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్చ

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో డాక్టర్ కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం నగరంలోని ట్రైడెంట్ హోటల్‌లో సమావేశమయ్యారు.

గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మెడికల్, పారామెడికల్ హెల్త్ కేర్ రంగాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏటా 8,515 మెడికల్ గ్రాడ్యుయేట్స్, 6,880 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్స్‌లతో పాటు 22,970 మంది పారా మెడికల్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ నగరం మెడికల్ వ్యాల్యూ టూరిజం డెస్టినేషన్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టామ్‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్) ద్వారా నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రొఫెషనల్స్‌గా శిక్షణ ఇచ్చి వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన మెడికల్, పారా మెడికల్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోoగ్తూ, కమిషనర్ ఆర్.వి కర్ణన్, టామ్‌కామ్ సిఇఒ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ హైమావతి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒ విశాలాక్షి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, డాక్టర్ శివరామ ప్రసాద్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Australians 2

Australians 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News