Sunday, January 19, 2025

రోడ్డు ప్రమాదంలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి..

- Advertisement -
- Advertisement -

Australian Legend Andrew Symonds dies in Road Accident

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆస్ట్రేలియా క్రీడాలోకంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం రాత్రి  క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లేలో సైమండ్స్ వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సైమండ్స్‌ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సైమండ్స్‌ మృతిపట్ల మాజీ సహచరుడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్ తోపాటు పలువురు క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైమండ్స్‌ మరణం పట్ల ఐసిసి సంతాపం తెలిపింది.

కాగా, సైమండ్స్ తన క్రికెట్ కెరీర్ లో మొత్తం 197 వన్డేలు, 26 టెస్టులు, 14 టి20 మ్యాచ్ లు ఆడాడు. ఐపిఎల్ లోనూ సైమండ్స్ హైదరాబాద్, ముంబై జట్ల తరఫున ఆడాడు. ఐపిఎల్ ఫస్ట్ సీజన్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సైమండ్స్ నిలిచాడు.

 

Australian Legend Andrew Symonds dies in Road Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News