Thursday, January 16, 2025

దేశం కంటే ఐపిఎల్ ముఖ్యమా?

- Advertisement -
- Advertisement -

పెర్త్ : ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ట్రెవర్ బెలిస్‌లపై దేశ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. ఆ ఇద్దరికీ దేశం కంటే ఐపిఎలే ముఖ్యమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆస్ట్రేలియా సొంతగడ్డపై ప్రస్తుతం పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడుతుండగా మరోవైపు బిగ్‌బాష్ లీగ్ కూడా సాగుతోంది. పాంటింగ్.. టెస్టు సిరీస్‌లో కామెంటరీ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా వాటిని మధ్యలోనే వదిలి దుబాయ్ చేరాడు. బెలిస్ కూడా బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బెలిస్ అది వదిలేసి వేలంలో పాల్గొనేందుకు పాటింగ్ దారిలోను దుబాయ్ చేరుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News