Wednesday, January 22, 2025

నేరం చేయకపోయినా 20 ఏళ్లు జైలు శిక్ష.. చివరకు

- Advertisement -
- Advertisement -

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా లోని న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన కాథలీన్ ఫ్లోబిగ్ (55) కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు 1989-99 మధ్య కాలంలో ఆకస్మికంగా మృతి చెందారు. చనిపోయే సమయంలో వారంతా 19 రోజుల నుంచి 19 నెలల మధ్య వయసున్న వారే. కన్నతల్లే వారిని చంపి వేసిందని ఆరోపణలు వచ్చాయి. పిల్లల పెంపకం లోని కష్టాలపై డైరీలో ఆమె రాసిన రాతలు, ఇతర సాక్షాల ఆధారంగా 2003లో కోర్టు ఆమెకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె తాను ఏ తప్పూ చేయలేదని న్యాయ పోరాటం చేసినా ఫలించలేదు. ఇటీవల ఈ కేసు దర్యాప్తు మళ్లీ చేపట్టారు. ఆ నలుగురు పిల్లల్లో అరుదైన జన్యు లోపాలున్నాయని, అందువల్లనే వారు ఆకస్మికంగా మరణించారని పరిశోధకులు కనుగొన్నారు.

తల్లి డీఎన్‌ఎ లోనూ అసాధారణ జన్యుక్రమం కనిపించిందని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా పిల్లలను ఊపిరాడనీయకుండా చేసినట్టు , లేదా వారు గాయపడినట్టు ఆధారాలు కూడా లభించలేదని పరిశోధకులు తేల్చారు. ఈ క్రమం లోనే న్యూసౌత్ వేల్స్ గవర్నర్ ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News