Thursday, January 23, 2025

క్వార్టర్ ఫైనల్లో నాదల్..

- Advertisement -
- Advertisement -

Australian Open 2022: Rafael Nadal reches quarter finals

బార్టి, బార్బొరా, మెడిసన్ కీ ముందుకు
ఆస్ట్రేలియా ఓపెన్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ సంచలనాలకు వేదికైంది. స్టార్ ప్లేయర్లు ఇంటి ముఖం పడుతుండగా కొత్త యువకెరటాలు ముందుకు దూసుకెళుతున్నాయి. టోర్నిలో భాగంగా ఆదివారం జరగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో నాదల్, బెరెత్తిని, మోన్‌ఫిల్స్, షపావలోవ్‌లు ఘన విజయం సాధించారు. నాలుగో రౌండ్‌లో గెలిచిన క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఈ పోరులో అడ్రియన్ మన్నారనినోను 7-6(14), 6-2,6-2తేడాతో నాదల్ ఓడించాడు. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకోవడం నాదల్‌కిది 14వ సారి. తొలి సెట్‌లో వీరిద్దరూ తీవ్రంగా శ్రమంచినా తనదైన ఆట శైలితో మన్నారినోను బురిడి కొట్టించిన నాదల్ 67తో సెట్ కైవసం చేసుకున్నాడు. అనంతరం రెండు సెట్‌లలోనూ నాదల్ ఆధిపత్యం చలాయించి 62 62 మన్నారినోను వరుస సెట్లలో ఓడించి గేమ్‌నె సొంత చేసుకున్నాడు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, మూడో సీడ్ అలెక్సాండర్ జ్వెరెవ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. డెనిస్ షపొవలోవ్ చేతిలో 6-3,7-6(5),6-3 తేడాతో ఓడిపోయాడు. ఫలితంగా కెరీర్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. తదుపరి మ్యాచ్‌లో నాదల్‌తో తలపడనున్నాడు. ఇక మహిళ సింగిల్స్ యాష్ బార్టీ 6-4, 6-3 తేడాతో అమందను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ బార్బొరా కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. నాలుగో రౌండ్‌లో విక్టోరియాను 6-2,6-2 తేడాతో మట్టికరిపించింది. 85నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్. బార్బొరా క్వార్టర్స్‌లో మడిసన్ కీస్‌తో తలపడనుంది.
క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా మీర్జా జోడి సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సానియా మీర్జా-రాజీవ్‌రామ్(అమెరికా) ఘన విజయం సాధించింది. రెండో రౌండ్‌లో మాట్వే మిడిల్‌కూపా(నెదర్లాండ్స్)-ఎల్లెన్ పెరెజ్ (ఆస్ట్రేలియా) జోడీని 7-6(4)-6-4 తేడాతో సానియా జోడీ ఓడించింది. దీంతో వీరు మిక్సిడ్ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టా రు. 27 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో మొదటి రెండు రౌండ్ లు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. దీంతో తొలి సెట్ కైవసం చేసుకునేందుకు మీర్జా, రామ్ జోడి తీవ్రంగా శ్ర మించింది. అనంతరం మాట్వె-ఎల్లెన్‌ల చేసిన తప్పిదాన్ని తమకు అనుకూలంగా మా ర్చుకున్న సాని యా ద్వయం మొదటి సెట్‌ను గెలుచుకుంది. దీంతో ఈ టోర్నీలో రెండో విజయం సాధించి క్వార్టర్స్ చేరుకున్నారు. తొలి రౌండ్‌లో సెర్బియా ద్వయం అలెక్సండ్రా క్రునిక్-నికోలాను 6-3, 7-6(3) తేడాతో ఓడించింది సానియా జోడీ.

Australian Open 2022: Rafael Nadal reches quarter finals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News