Sunday, January 19, 2025

అసాంజే తిరిగి స్వదేశానికి రావాలని కోరుతున్న ఆస్ట్రేలియా పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్నె: వికిలీక్స్ సంస్థాపకుడు జూలియన్ అసాంజే పై సాగుతున్న విచారణకు సామరస్య పూర్వక ముగింపు లభిస్తుందని, ఆయన తిరిగి స్వదేశానికి వచ్చే వీలు కలుగుతుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గురువారం ఆశాభావం వెలిబుచ్చారు. ఆస్ట్రేలియా పౌరుడైన అసాంజే స్వదేశానికి తిరిగి వచ్చేలా అవకాశం కల్పించాలని అమెరికా, బ్రిటన్ దేశాలపై ఒత్తిడి పెంచుతూ ఆస్ట్రేలియా పార్లమెంట్ సభ్యులు తీర్మానం చేశారు.

గూఢచర్యం ఆరోపణలపై అసాంజేను అమెరికా, బ్రిటన్ దేశాలకు అప్పగించాలన్న అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలను వ్యతిరేకిస్తూ అసాంజే చేసిన అప్పీలుపై వచ్చేవారం బ్రిటన్ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ ఈ విచారణకు సామరస్య పూర్వక ముగింపు లభించగలదని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇతర దేశాల న్యాయపరమైన వ్యవహారాల్లో ప్రమేయం కల్పించుకోవడం ఆస్ట్రేలియా లక్షం కాకపోయినా, తమ దృఢమైన అభిప్రాయం చెప్పడం సమంజసమైనదేనని పేర్కొన్నారు. అసాంజేకు మద్దతుగా ఇండిపెండెంట్ ఎంపీ ఆండ్రూ విల్కీ ఈ తీర్మానం ప్రవేశ పెట్టినందుకు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News